వారసుడికి పార్టీ పగ్గాలు

6 Nov, 2019 09:26 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌ జన్‌శక్తి పార్టీ(ఎల్‌జేపీ) కొత్త అధ్యక్షుడిగా చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరంలో ఎల్‌జేపీని స్థాపించిన సీనియర్‌ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ (73) దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్‌గా కొనసాగారు. నూతన అధ్యక్షుడిగా తన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుందని మంగళవారం ఆయన ప్రకటించారు. రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన చిరాగ్‌ కొంతకాలంగా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

వచ్చే ఏడాది జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌ను ఎల్‌జేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్‌జేపీ చేరడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ‘యువ నాయకత్వం కోసం కార్యకర్తలందరూ పట్టుబట్టారు. ఎంపీలు కూడా దీనికి మద్దతు ప్రకటించారు. పేదలు, నిమ్నవర్గాలకు న్యాయం జరిగేలా పార్టీని చిరాగ్‌ నడిపిస్తాడని నాకు నమ్మకముంద’ని రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అన్నారు.

సంస్థాగతంగా ఎల్‌జేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియాకు చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. త్వరలో జరగనున్న జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. గత ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఎల్‌జేపీ కేవలం ఒకచోట మాత్రమే పోటీ చేసింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవన్, లోకేష్‌ శవ రాజకీయాలు మానండి 

గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్‌ నేతల గలాటా 

బుజ్జగించేందుకు బాబొస్తున్నారు! 

దోపిడీ బాబు నీతులు చెప్పడమా? 

ఆర్‌సెప్‌పై మోదీ తగ్గడం మా విజయమే

ప్రైవేట్‌ బస్సులు నడిపితే తగులబెడతాం 

‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!

‘మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదు’

బీజేపీ కీలక ప్రకటన.. ప్రతిష్టంభన తొలగినట్లేనా?

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన సంజయ్‌

‘సినిమాలకే కాదు.. రాజకీయాలకూ పనికిరాడు’

మాజీ ఎంపీ జేసీకి మరో ఎదురుదెబ్బ

నినాదాలు కాదు.. ఆచరణ ఎక్కడ..? : ఆజాద్‌

'నా పేరుతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారు'

‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’

లంచగొండులారా.. ఖబడ్ధార్

‘మహా రాజకీయాల్లో ఆరెస్సెస్‌ జోక్యం’

అన్నతో పొసగక పార్టీ మారిన సోదరుడు..

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండ

సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

పవన్‌ కోరితే మద్దతిచ్చాం

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్నపాత్రుడి సోదరుడు 

ఇసుక సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనే

పవన్‌.. ఇక సినిమాలు చేసుకో

చంద్రబాబు అజెండా మోస్తున్న పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞానవాసి

రాజకీయాల కోసమే లాంగ్‌ మార్చ్‌

పోటీ చేసిన వారిదే బాధ్యత

ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌