వైరల్‌ : చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామన్న యువతి

5 Apr, 2019 11:17 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోనే ఎదురుగాలి వీస్తోంది. ప్రజల సంక్షేమం పట్టించుకోని బాబుకు ఈ సారి ఓట్లేసే ప్రసక్తే లేదని అక్కడి ప్రజలు తేల్చిచెప్తున్నారు. టీడీపీ పెట్టిన పథకాలు ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రన్న భీమా కింద రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా మోసం చేస్తున్నారని సత్యవేడు నియోజకవర్గం బీఎం కండ్రిక మండలం కొత్తూరుకు చెందిన చాందిని అనే యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చెక్కులు ఇచ్చినట్టు ఫొటోలు తీసుకుని మొండి చేయిచూపించారని ఆమె మండిపడ్డారు. చెక్కు ఇవ్వాలని నిలదీసి అడిగితే.. మీకు బీమా వర్తించదని చెప్తున్నారని ఆమె వాపోయారు. వర్షాలు పడినప్పుడు మాత్రమే తాగునీరు ఉంటుందని, మిగతా రోజుల్లో ప్రజలు చావాలా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలంటే అంత అలుసా అని మండిపడ్డారు. మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబుకు ఈ సారి ఒక్క ఓటు కూడా ఎవరూ వేయరని అన్నారు. కాగా, బాబుపై చాందిని ఫైర్‌ అయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు