ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

26 May, 2019 08:28 IST|Sakshi
సూపర్‌స్టార్‌ శ్రీనివాసన్‌

పెరంబూరు: నటుడు సూపర్‌స్టార్‌ శ్రీనివాసన్‌కు ఓటర్లు షాక్‌ ఇచ్చారు. ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌గా మార్చేశారు. సినిమా క్రేజ్‌ ఉంది కదా అని అందరూ రాజకీయ నాయకులైపోయి ఏలేద్దాం అనుకుంటే కుదరదు. అలా ఆశపడిన హాస్యనటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ ఓటర్ల చేతిలో ఘోరంగా భంగపడ్డారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున దక్షిణ చెన్నై స్థానానికి పోటీ చేశారు. తన విజయం ఖాయమని, లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు పొందారు. కేవలం 670 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌ అని అభిమానులు ఎగతాలి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు