రేపు లోక్‌సభ ముందుకు ప్రతిష్టాత్మక బిల్లు

8 Dec, 2019 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నపౌరసత్వ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది మోదీసర్కార్‌. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వలసొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ సవరణ బిల్లు తెచ్చింది కేంద్రం. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసింది. ముస్లిం దేశాల నుంచి మతఘర్షణల కారణంగా వలసొచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా