ఓడిపోతామనే భయంతోనే నోటీసులు : ప్రియాంక

30 Apr, 2019 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం రాహుల్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వాస్తవాలేంటో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ నోటీసులపై రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్‌ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసని.. ఆయన ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగిరాని ప్రియాంక స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి నోటీసులు పంపుతున్నారని ప్రియాంక మండిపడ్డారు.

రాహుల్‌ గాంధీ భారతీయుడు కాదని.. ఆయనకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన 2015లోనే స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్‌ను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అప్పట్లో దుమారం రేగడంతో తాను భారతీయుడినేనని రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు