ఆ అధికారం పార్టీ అధ్యక్షుడికే ఉంటుంది: మంత్రి

19 Feb, 2020 16:49 IST|Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌(నల్గొండ): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత ఎంసీ కోటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై బుధవారం విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పందిస్తూ.. పార్టీ నుంచి నేతలను సస్పెండ్‌ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర పార్టీ బాధ్యులను.. పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకే సస్పెండ్‌ చేస్తూ వస్తున్నామన్నారు. అక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలియదని, అసలు విషయం తాను తెలుసుకుంటానని మంత్రి  జగదీష్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు