కేసీఆర్‌ స్పీచ్‌లా గవర్నర్‌ ప్రసంగం

19 Jan, 2019 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో అందరిని కలుపుకుని ముందుకెళతానని కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించినట్లు గవర్నర్‌ ప్రసంగం ఉందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, పింఛన్‌ గురించి గవర్నర్‌ ఏం చెప్పలేదని తెలిపారు. పాలకులు.. ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అధికార పార్టీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌కు తమ ఎమ్మెల్యేలు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదని.. కావాలనే అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

గవర్నర్‌ ప్రసంగం కాపీ, పేస్ట్‌లా ఉంది : షబ్బీర్‌
ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడే మాటలనే గవర్నర్‌ కాపీ కొట్టారంటూ కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీ, పింఛన్‌, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారో గవర్నర్‌ స్పష్టం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ముస్లిం రిజర్వేషన్‌లపై కూడా గవర్నర్‌ ప్రసంగంలో మైనార్టీగా ప్రస్తావించారని.. దీని గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు