స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ ; చంద్రబాబు ఆందోళన..!

14 May, 2019 15:19 IST|Sakshi

సాక్షి, అమరావతి :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో సోమవారం భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై గంటపాటు సమగ్రంగా చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి కలుద్దామని కోరారు. స్టాలిన్‌ తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్టు టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెప్పారు. ఇక స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో డీఎంకే వైఖరేమిటో తెలుసుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే, కోశాధికారి దురై మురుగన్‌తో ఏపీ సీఎం మంగళవారం సమావేశమైనట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ భేటీ అయినప్పుడు చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. అప్పట్లో బీజేడీ ఎంపీని రప్పించుకుని వివరాలు కనుగొన్నారు.
(చదవండి : కేసీఆర్‌తో మంతనాలు.. స్టాలిన్‌ మరో ట్విస్ట్‌!)

ఇదిలాఉండగా.. స్టాలిన్‌, కేసీఆర్‌ మధ్య భేటీ సక్సెస్‌ అయిందనీ ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై డీఎంకే పార్టీ సానుకూలంగా స్పందించిందనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్టాలిన్‌ తలుపులు మూసేశాడని, బీజేపీతో దోస్తీ కడుతున్నాడని తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీజేపీతో దోస్తీ దిశగా స్టాలిన్‌ అడుగులు వేస్తున్నారన్న కథనాలు నేపథ్యంలో ఆయన బీజేపీతో చర్చలు జరిపిన విషయం వాస్తవమేనని ఆ పార్టీ తమిళనాడు చీఫ్‌ తమిళ సై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. అయితే, బీజేపీతో డీఎంకే జట్టు కడుతుందనే వార్తలపై ఆ పార్టీ ఫైర్‌ అయింది. బీజేపీ-డీఎంకే కలవడం అనేది.. ఈ ఏడాది బెస్ట్‌ కామెడీ అని డీఎంకే ఎమ్మెల్యే ఎం.సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
కేసీఆర్‌, స్టాలిన్‌ భేటీపై ఆందోళనలో చంద్రబాబు 

మరిన్ని వార్తలు