అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

8 Nov, 2017 14:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్‌ అందించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం నుంచే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. 11వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మోటార్లకు పెట్టిన ఆటోస్టార్టర్లను రైతులు వెంటనే తొలగించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

నోట్ల రద్దు పరిణామాలపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం..
నరేంద్రమోదీ సర్కారు డీమానిటైజేషన్‌ చేపట్టి.. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నోట్ల రద్దు పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ వాయాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్‌ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. నోట్లరద్దుతో దేశ ఆర్థిక ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, వ్యాపారులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని, ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు