కమెడియన్లలా ఉన్నామా?

20 May, 2019 09:38 IST|Sakshi

మైసూరు : ‘ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మీడియా నన్ను మానసికంగా వేధిస్తోంది. మా నాయకులను ఇష్టం వచ్చినట్లు చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తోంది. మేమేమైనా కమెడియన్లమా?’ అని కర్ణాటక సీఎం కుమారస్వామి మీడియాపై చిందులేశారు. ఆదివారం మైసూరులో మీడియాతో మాట్లాడారు. ‘మమ్మల్ని కామెడీ అంశాలుగా చూపిస్తూ వార్తలు ప్రసారం చేసే అధికారం మీకెవరిచ్చారు? మమ్మల్ని ఏమనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించారు. ‘మీడియాతో సన్నిహితంగా మెలిగే నేతను నేను. ఇదే అదనుగా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తారా? ప్రసారం చేయడానికి వార్తలేమీ లేక ఇటువంటి ప్రోగ్రాంలు చేసుకుంటున్న టీవీ చానెళ్లకు సరైన మార్గంలో నడిపించడం చేతకాకపోతే మూసేసుకోండి’ అని అన్నారు. ‘ఇకపై మీడియాతో మాట్లాడను, మీడియాను బహిష్కరిస్తున్నా’ అని అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు