నియోజకవర్గాలన్నింటికీ కమిటీలు: చాడ

29 Jul, 2018 01:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలన్నింటికీ ఆగస్టు నెలాఖరులోగా కమిటీలను వేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి 14 వరకు సభలు, సమావేశాలు, సెమినార్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు.  టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను అమలుచేయాల ని కోరుతూ ఆగస్టు 13న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పార్టీ శ్రేణులతో కలసి ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని చాడ ప్రకటించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్లను అదే రోజున ముట్టడించాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా