ఒళ్లంతా కుట్రలే!

9 Apr, 2019 11:01 IST|Sakshi

ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తుంది 
నందమూరి తారకరామారావు గురించి ఆయన అల్లుడు చంద్రబాబు, ఎబీఎన్‌ అధినేత వేమూరి రాధాకృష్ణ జరిపిన సంభాషణ సోషల్‌ మీడియాలో కళ్లారా చూసి ఎంతో బాధపడ్డాం. నిజంగా ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభించేలా ఉంది. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న ఆయన్ను ‘వాడు’ అని సంబోధించడం సరైంది కాదు. వీరికి పుట్టగతులు ఉండవు.  

– సిద్దేశ్వర, ఎన్టీఆర్‌ అభిమాని, ఉరవకొండ 

కుట్రదారుడని రుజువైంది
ఎన్టీఆర్‌ జ్ఞాపకాలను పూర్తిగా ప్రజల హృదయాల్లో నుంచి చెరిపేయడానికి కుట్ర చేయడం బాధాకరం.  ఏబీఎన్‌ వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడి ఉంటారు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపొటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు అనేది దీని ద్వారా రుజువైంది. 

– డిష్‌ సురేష్, వజ్రకరూరు  

వీళ్లా పెద్ద మనుషులు?
సీఎం చంద్రబాబు, ఏబీఎన్‌ వేమూరి రాధాకృష్ణ ఇద్దరూ తెర ముందు పెద్ద మనుషులుగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే ఎన్టీఆర్‌ను వాడు అని సంబోధించే స్థాయిలో వీరు ఉన్నారంటే ఎంత నీచమైన బుద్దో అర్థం చేసుకోవచ్చు.  తెర వెనుక వీరు చేసిన నీచాన్ని సోషల్‌ మీడియా బయటపెట్టింది. ఇలాంటి వాళ్లని రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగేలా తరిమితరిమి కొట్టాలి.  

 – నులక రామయ్య, ధర్మవరం   

నీచబుద్ధి బయటపడింది 
టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్‌టీఆర్‌ని ‘వాడు’ అని చంద్రబాబు సంభోదించడం దారుణం. చంద్రబాబు నీచబుద్ధి బయటపడింది. బిడ్డనిచ్చిన మామనే ఇలా అవమానకరంగా మాట్లాడడం తెలుగుజాతికే సిగ్గుచేటు. ఓ వైపు ఎన్‌టీఆర్‌ అమర్‌రహే అంటూనే మరోవైపు ఇష్టంమెచ్చినట్లు మాట్లడడం బాబుకే చెల్లింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం.  

– జరిపటి మనోహర్, తనకల్లు 

బాబు అసలు రంగు బయటపడింది   
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అసలు రంగు బయటపడింది. ప్రభుత్వ పథకాల్లో ఆయన పేరు లేకుండా చేస్తానని చెప్పడం చాలా సిగ్గుచేటు. చంద్రబాబు రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ ప్రసాదించిన భిక్ష. అలాంటి మహావ్యక్తిని తీవ్ర పదజాలంతో తిట్టడం అనైతికం. చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. 

– నాగరాజు, ఎన్టీఆర్‌ అభిమాని, అమ్మవారిపల్లి 

తరిమి తరిమి కొట్టాలి
పిల్లనిచ్చిన మామను వాడు వీడు అంటూ సంబోధించిన సీఎం చంద్రబాబుని ఎన్టీఆర్‌ అభిమానులు తరిమి కొట్టాలి. పదవీ వ్యామోహంతో ప్రజలను ఇన్నాళ్లు మభ్యపెడుతూ వచ్చారు. చంద్రబాబు, వేమూరి రాధాకృష్ణ ఇద్దరూ తోడు దొంగలు. వీళ్ల నిజ స్వరూపం సోషల్‌ మీడియా బట్టబయలు చేసింది. తోక పత్రిక యజమానికి, చంద్రబాబుకు ఒళ్లంతా కుట్రలే అని తెలుస్తోంది.  


  – శివారెడ్డి, పోతుకుంట, ధర్మవరం మండలం  

బాబుకు మహిళలంటే చిన్నచూపు  
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలంటే చాలా చిన్న చూపు. మహిళ అనే గౌరవం లేకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారితో ఓ మహిళా నేతకు అనైతిక సంబంధాన్ని అంటగట్టి ప్రచారం చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు ఆదేశించడం దారుణం. ప్రతి  మహిళా ఈ విషయంగా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి. 

– శ్రీవాణి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, శెట్టూరు  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు