రచ్చ కెక్కిన ఫ్యామిలీ

25 Apr, 2018 07:59 IST|Sakshi

ద్రోహుల్ని తరిమి కొడదాం ఐక్యతతో ముందుకెళ్దాం

కేడర్‌కు దినకరన్‌ పిలుపు

పరోక్షంగా దివాకరన్‌కు చురకలు

సాక్షి, చెన్నై: మేనమామ దివాకరన్‌ను ఢీకొట్టే రీతిలో పరోక్షంగా మంగళవారం అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ వ్యాఖ్యలు సంధించారు. కేడర్‌కు లేఖాస్త్రం సందిస్తూ, దివాకరన్‌ కుట్రల్ని భగ్నం చేద్దామన్నట్టుగా పిలుపు నివ్వడం గమనార్హం. దినకరన్‌ పరోక్షంగా స్పందిస్తే, దివాకరన్‌ బహిరంగంగానే ఎదురుదాడికి దిగడంతో చిన్నమ్మ కుటుంబ విబేధాలు రచ్చకెక్కాయి.
చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ వార్‌ మరింతగా ముదురుతోంది. ఆమె సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్‌ల మ«ధ్య ఈ సమరం మరింతగా రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారుడు వెట్రివేల్‌  ద్వారా దివాకరన్‌కు చెంపపెట్టు తగిలే రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన దినకరన్, తాజాగా తానే రంగంలోకి దిగి కేడర్‌కు లేఖాస్త్రం సంధించడమే కాదు, పరోక్షంగా మేనమామకు చురకలు అంటించే పనిలో పడడం గమనార్హం.

ఐక్యతతో తిప్పి కొడదాం :అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీని రక్షించుకునేందుకు చిన్నమ్మ శశికళ రంగంలోకి దిగాల్సి రావడానికి గల పరిస్థితులను ఆ లేఖాస్త్రంలో గుర్తు చేశారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో అధికారంలో ఉన్న ద్రోహులు పార్టీని ౖకైవసం తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని వివరించారు. ద్రోహుల వైపుగా వెళ్లకుండా అమ్మ ఆశయ సాధన నినాదంతో చిన్నమ్మకు మద్దతుగా లక్షలాదిగా కేడర్‌ తన వెంట కదిలిందని గుర్తు చేశారు. ప్రజా మద్దతు ఈ కళగంకు హోరెత్తుతుండడంతో నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు బయలు దేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మధ్యమాల ద్వారా కళగంలో గందరగోళ పరిస్థితులు సృష్టించే కుట్రలు సాగుతున్నాయని పరోక్షంగా మేనమామ దివాకరన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. ద్రోహులతో కలిసి ఈ గందరగోళ ప్రయత్నాలకు దిగారని, ఈ కుట్రల్ని భగ్నం చేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో కొత్త కుట్రలకు సాగుతున్న ప్రయత్నాల్ని ఐక్యతతో తిప్పి కొడదామని కేడర్‌కు పిలుపునిచ్చారు.  చిన్నమ్మే మార్గదర్శి అని పరోక్షంగా దివాకరన్‌ను ఎలాంటి సంబంధాలు లేదన్న వ్యాఖ్యల్ని ఆ లేఖలో దినకరన్‌ స్పందించడం గమనార్హం.

తగ్గని మేనమామ..
దినకరన్‌ వ్యాఖ్యల తూటాలకు మేనమామ దివాకరన్‌ ఏమాత్రం తగ్గలేదు. ఢీకి సై అన్నట్టు ఎదురుదాడికి దిగారు. మన్నార్‌కుడిలో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ దినకరన్‌పై విరుచుకుపడడంతో చిన్నమ్మ ఫ్యామిలీ వార్‌ రచ్చకెక్కింది. అన్నా, ద్రవిడం అన్న పదాలు లేని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. దినకరన్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.  ఇక దినకరన్‌తో కలిసి పయనం సాగించే ప్రసక్తే లేదని తేల్చారు. దినకరన్‌ వెన్నంటి ఉన్న కొం దరు ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చిన వారేనని వారికి అంతా తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జయలలితతో కలిసి అన్నాడీఎంకేకు దశాబ్దాల తరబడి తాను సేవల్ని అందించానని, ఆ సేవలు ఇక, మరింత విస్తృతం అవుతా యని వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు