మోదీ సర్కారుకు అభినందనలు: రాహుల్‌ గాంధీ

8 Sep, 2019 16:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టకుండానే వందరోజులు పూర్తి చేసుకున్న మోదీ సర్కారుకు అభినందనలు అంటూ ఆయన కామెంట్‌ చేశారు. తీవ్ర మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆర్థిక వ్యవస్థ విషయంలో మోదీ సర్కారుకు దిశానిర్దేశం, నాయకత్వం కొరవడిందని మండిపడ్డారు.

‘వందరోజులైనా ఎలాంటి అభివృద్ధి లేని మోదీ సర్కారుకు అభినందనలు. ప్రజాస్వామ్యాన్ని ముంచడంలో, విమర్శల నుంచి బయటపడేందుకు మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడంలో మోదీ సర్కారు నిమగ్నమైంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సరైన నాయకత్వం, దిశానిర్దేశం, ప్రణాళికలు అవసరముండగా..అవేవీ లేకుండా మోదీ సర్కారు సాగుతోంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

 

మరిన్ని వార్తలు