గవర్నర్‌కు టీ.కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

17 Sep, 2019 19:37 IST|Sakshi

ప్రభుత్వం ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కింది: భట్టి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మంగళవారం గవర్నర్‌ తమిళిసైను కలిసి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో తలసాని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చి ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారని, అలాగే పార్టీ మారిన సబితా ఇంద్రారెడ‍్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.

అనంతరం గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన సబిత ఇంద్రారెడ్డిని మంత్రి వర్గంలో తీసుకుని తెలంగాణ సర్కార్‌ మరోమారు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తోక్కిందని విమర్శించారు.  తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా కూనీ అవుతుందో గవర్నర్‌కు వివరించామని తెలిపారు. అలాగే తలసాని శ్రీనివాస్‌ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పార్టీ.. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పోడించిందని అన్నారు. శాసన సభ పక్షంలోని 12మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అంశం కోర్టులో ఉందని పేర్కొన్నారు. వారి వీలినం చెల్లదని, తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలు కోర్టుకు అందించామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు