జీడీపీలో 10% కాదు 1.6 శాతమే!: కాంగ్రెస్‌

18 May, 2020 06:15 IST|Sakshi
ఆనంద్‌ శర్మ

న్యూఢిల్లీ: రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, జీడీపీలో 10% అని అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ప్యాకేజీ నికరంగా రూ. 3.22 లక్షల కోట్లు మాత్రమేనని, అది జీడీపీలో 1.6% మాత్రమేనని పేర్కొంది. ప్రధాని మోదీ  అవాస్తవాలు చెప్పడం మాని తామేం చేయగలరో స్పష్టంగా చెప్పాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు. ప్యాకేజీపై చర్చకు సిద్ధమా? అని ఆర్థికమంత్రికి ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం వైఫల్యం వల్లనే లక్షలాది వలస కూలీలు కాలి నడకన వందలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లే విషాద పరిస్థితి నెలకొంది’అని ఆరోపించారు.

నంబర్లాట: లెఫ్ట్‌: ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నంబర్లతో ఆడుతున్న మోసపూరిత ఆటలా ఉందని వామపక్షాలు విమర్శించాయి. రుణ పరిమితిలో రాష్ట్రాలు 14% మాత్రమే వాడుకున్నాయంటూ రాష్ట్రాలను ఆర్థికమంత్రి నిర్మల అవహేళన చేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను అమ్మేసి స్వయం సమృద్ధి సాధించాలనుకుంటున్నారా? అని సీపీఐ నేత రాజా ఆర్థికమంత్రిని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు