‘ఏ పార్టీతో పొత్తు కాదు.. ప్రజలతోనే మా పొత్తు’

17 Jul, 2018 19:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కాదు.. ప్రజలతోనే మా పొత్తు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్‌ ఊమెన్‌ చాందీ తెలిపారు. యూపీఏ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏపీలో 74 అసెంబ్లీ నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించామన్నారు. పార్టీ బలోపేతానికి చెపట్టవలసిన చర్యలపై  కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ విభజన సమయంలో చెప్పింది.. దానికే కట్టుబడి ఉన్నామని ఉమెన్‌ చాందీ చెప్పారు.

అధికారంలో లేనప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావలని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మాట మార్చారని ఆయన విమర్శించారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో ఉన్న టీడీపీ హోదా సాధించలేకపోయిందని కాంగ్రెస్‌ నేత ధ్వజమెత్తారు. జిల్లాలో జ్యూట్ మిల్లులు  మూతపడితే 25 వేలలకుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదుని మండిపడ్డారు.

‘ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు చట్టంలో ఇవ్వాలని చెప్పాం. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. రూ 24,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.1,050కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. జిల్లాకు ఇస్తామన్నాఅనేక ప్రాజెక్టులకు అతిగతి లేదు. కాంగ్రెస్ హయాంలో ప్రారంబించిన అనేక సాగు నీటి ప్రాజెక్టులను కనీసం పూర్తి చేయలేని పరిస్తితి జిల్లాలో ఉంది. అక్టోబర్ 2 నుంచి ఇంటింటి కాంగ్రేస్ నిర్వహిస్తాం’  అని కాంగ్రెస్‌ నేత ఉమెన్‌ చాందీ తెలిపారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా