ప్రజా తీర్పును అగౌరవపర్చిన తొలి సీఎం కేసీఆర్‌

6 Sep, 2018 17:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌కు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినా..దొడ్డిదారిన అసెంబ్లీ రద్దు చేశారని టీపీసీపీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును అగౌరవపర్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆరోపించారు. ఎన్నికల హామీలను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్న కేసీఆర్‌ మధ్యలోనే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.

ఓటమికి భయపడి ప్రజల తీర్పును అగౌరవపరిచారని ఆరోపించారు. తెంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం పెరిందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50సార్లకు ఎక్కువగా కోర్టులు కేసీఆర్‌ నిర్ణయాలను తప్పుబట్టాయని గుర్తుచేశారు. మల్లన్న సాగర్‌లో 144 సెక్షన్‌ పెట్టిన గొప్పనియంత కేసీఆర్‌అని విమర్శించారు. గత ఎన్నికల మేనిఫెస్టో మీద చర్చకు సిద్దమా అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు