'రాజీనామా చేసి తప్పుకుంటా..'

11 Jan, 2018 13:40 IST|Sakshi

టీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి సవాల్‌

కాంగ్రెస్‌ పోరాటంతోనే 53 శాతం విద్యుత్‌ వాటా

విద్యుత్‌ పేరుచెప్పి కేసీఆర్‌ దోపిడీ

ప్రభుత్వ అవినీతిపై బహిరంగచర్చకు సిద్దం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరుగుతున్న అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ గురువారం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పోరాటంతోనే పునర్విభజన చట్టంలో 53 శాతం విద్యుత్ వాటాను కేటాయించారన్నారు. 24 గంటలు విద్యుత్ రావడంలో కేసీఆర్ ప్రమేయం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ పథకం తెచ్చినా అవినీతే అని ఆయన మండిపడ్డారు. విద్యుత్‌ పేరు చెప్పి కేసీఆర్‌ దోచుకుంటున్నారన్నారు. కేవలం రూ.105 కోట్లు కరెంటు కోసమే యాడ్‌ ఇచ్చారని తెలిపారు. అధికారులు వద్దని చెప్పినా చత్తీస్‌ఘడ్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నారని.. నిజాయితీ గా ఉన్న అధికారులను సీఎం బదిలీ చేస్తన్నారని ఆరోపించారు.

ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు రూ. 4000 కోట్ల భారం పడుతుందన్నారు. మరో వైపు భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల విషయంలో పారదదర్శకంగా లేదని కేంద్ర విద్యుత​ శాఖ మంత్రే చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి వచ్చే కమీషన్‌ కోసమే యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులన్నారు. బీహెచ్‌ఈఎల్‌ కి ఇచ్చిన కాంట్రాక్టు, సోలార్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిరూపిస్తానని.. ఒకవేళ నిరూపించక పోతే రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కోమటి రెడ్డి సవాల్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే సవాల్ కు సిద్ధం కావాలని.. అవినీతి జరగలేదని నిరూపించుకోవాలన్నారు. అసెంబ్లీలోనైనా, ప్రగతిభవన్‌ అయినా తాము చర్చకు సిద్దమన్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో పెట్టిన మోటార్స్‌ కూడా కాంగ్రెస్‌​ హయాంలో వచ్చినవే అని కోమటిరెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు