‘ప్రతి ఇంటికి తాళం వేయండి’

17 Jul, 2018 17:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కత్తి మహేశ్‌, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కాగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల పేరిట ఎవరిని పడితే వారిని అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలెవరూ బయటకి రాకుండా ప్రతి ఇంటికి తాళం వేయండి ..శాంతి భద్రతలు ఇంకా బాగుంటాయని ఎద్దెవా చేశారు.

పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చినజీయర్‌ స్వామి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. స్వామీజీ ఎం తప్పు చేశారని ఆయనపై గుండా యాక్ట్‌ పెట్టారని మండిపడ్డారు.  ప్రగతి భవన్‌ వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేడయం దారుణమన్నారు.  ముఖ్యమంత్రి ప్రతి చర్యను గవర్నర్‌ సమర్థించడం సరికాదన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా