ఇవాంకకు లేఖ రాశా.. జీఈఎస్‌ ఖర్చు ఎంత..?

1 Dec, 2017 23:39 IST|Sakshi

ఆమెకు అన్నీ అబద్ధాలే చెప్పారన్న వీహెచ్‌

సదస్సుపై శ్వేతపత్రానికి షబ్బీర్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారశ్రామిక వేత్తల సదస్సు కేటీఆర్‌ షో గా నడిచిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు విమర్శించారు. కీలకమైన సదస్సులో నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించరన్నారు. కనీసం నగర మేయర్‌నుకూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సదస్సుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమెరికా అద్యక్ష సలహాదారు ఇవాంకాకు హైదరాబాద్‌లో అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు.  వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు లేఖ రాసినట్టు వీహెచ్‌ తెలిపారు.

జీఈఎస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి :షబ్బీర్‌ అలీ డిమాండ్‌
ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రభు త్వం పెట్టిన ఖర్చు ఎంత, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని, కొత్తగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయో శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రపం చ పారిశ్రామికవేత్తలు హైదరాబా ద్‌ కు వచ్చిన సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకోసం ఆకర్షించడంలో, హామీలను సాధించుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ స్వంత ప్రచారం తప్ప పెట్టుబడులను సాధించుకోవాలని, తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలనే చిత్తశుద్ధి లేదని షబ్బీర్‌ అలీ ఆరోపించారు.

మరిన్ని వార్తలు