టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే: కాంగ్రెస్‌

4 Dec, 2018 15:12 IST|Sakshi

హైదరాబాద్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉందని, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ కుమార్‌ తివారీ వ్యాఖ్యానాంచారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం చాలా దారుణమన్నారు. తెలంగాణాలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగడం లేదన్నారు. గతంలో కూడా కోదండరాంను కూడా ఇలానే అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి బహిరంగంగానే మద్ధతు తెలిపిందని చెప్పారు. లోక్‌సభకు ఎన్నికలు జరిగే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు.

రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం: అజారుద్దీన్‌

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు అజారుద్దీన్‌ అన్నారు. పోలీసులు చట్టపరిధి దాటి శ్రుతి మించి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని కోరారు. కాంగ్రెస్‌ గెలుపు ఖాయం కావడంతోనే టీఆర్‌ఎస్‌ ఇలాంటి పనులు చేస్తున్నదని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు