భట్టి ముందే బాహాబాహీ!

2 Feb, 2019 13:58 IST|Sakshi

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల రచ్చ

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సన్మాన కార్యాక్రమం రసాభాసగా మారింది. సీనియర్‌ నేత వి హనుమంతరావును అంబర్‌పేట నియోవర్గ నేత శ్రీకాంత్‌ అనచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్‌కు టికెట్‌ రాకుండా వీహెచ్‌ అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. ఆయన అనచరులు ఆందోళన చేపట్టారు. సహనం కోల్పోయిన  వీహెచ్‌ వారిపై దుర్భాషలాడారు. దీంతో శ్రీకాంత్‌ అనచరులు వీహెచ్‌పైకి దూసుకెళ్లారు.

అతనికి వ్యతిరేకంగా వీహెచ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. వీహెచ్‌ వర్గీయులు కూడా దూసుకురావడంతో  సమావేశం రచ్చ రచ్చైంది. ఇరువర్గాల నేతలు కుర్చీలతో, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలను సీనియర్‌ నేతలు శాతింపజేసే ప్రయత్నం చేశారు. సీఎల్పీనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కను శనివారం సన్మానించేందుకు పార్టీ వర్గాలు గాంధీభవన్‌లో ఏర్పాటు చేశాయి. అయితే వీహెచ్‌-శ్రీకాంత్‌ వర్గపోరుతో ఈ సమావేశం రసాభాసగా మారింది.

మరిన్ని వార్తలు