సెక్రటేరియట్‌ భవనాలు మరో వందేళ్లుంటాయి : జీవన్‌రెడ్డి

26 Jun, 2019 19:11 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : వెంకయ్య నాయుడు మధ్యవర్తిగా ఉండి బీజేపీలో చేరేలా ప్రొత్సాహిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమయ్యి మూడు వారాలు గడుస్తున్నా వానలు లేక రైతాంగం బాధపడుతుందన్నారు. కానీ కేసీఆర్‌ రైతుల బాధలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల్లో రూ. 60 కోట్ల అప్పు ఉంటే.. టీఆర్‌ఎస్‌ ఐదేళ్ల పాలనలో అది 1.80 లక్షల కోట్లకు చేరిందన్నారు.

అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు కేసీఆర్‌ పాలన సాగుతుందని షబ్బీర్‌ అలీ విమర్శించారు. సెక్రటేరియట్‌ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు, మసీదులు తొలగిస్తే సహించేది లేదన్నారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ చేయడం మోదీ, కేసీఆర్‌ల తరం కాదన్నారు షబ్బీర్‌ అలీ.

ఆ భవనాలు మరో 100 ఏళ్ల పని చేస్తాయి : జీవవన్‌ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌ అసెంబ్లీలు భవనాలు ఇంకా 100 సంవత్సరాల వరకూ పని చేస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు