రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్‌

10 Jul, 2019 14:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్‌​ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై  గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు. 

రైతులు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డిలో ప్రభుత్వం నాలుగు శాతం చెల్లిస్తే మిగతా మూడు శాతం రైతులు చెల్లించి వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత రుణం చెల్లిస్తినే కొత్త రుణం ఇస్తామని బ్యాంకులు చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనికి చర్యగా ప్రభుత్వం బ్యాంకులు వెంటనే కొత్త రుణాలను జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బ్యాంకర్స్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేసి మిగతా నాలుగు శాతం కేంద్రం నాబార్డ్‌ ద్వారా చెల్లించే విధంగా  చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు