‘21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’

15 Oct, 2019 15:54 IST|Sakshi

ప్రభుత్వ వైఖరిపై ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ను తొలగిస్తున్నాం... కొత్త వారిని నియమిస్తాం అని సీఎం కేసీఆర్‌ అహాంకార పూరితంగా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌ మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం అధికార మదంతో మట్లాడుతున్నారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్‌ నేతలు దామోదర్‌ రాజనర్సింహ్మా, షబ్బీర్‌ అలీతో కలిసి రేవంత్‌ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

19 లోపు సమస్య పరిష్కరించాలి..
‘పోలీసులతో కలిసి కార్మికులపై సీఎం పెత్తనం చేస్తున్నారు. బేషజాలకు పోకుండా ప్రభుత్వం చర్చలు జరపాలి. గత పదిరోజుల పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలన్నీ బంద్ లో పాల్గొంటాయి. 19 తారీఖులోపు ఆర్టీసీ సమస్య పరిష్కరించకుంటే 21న ప్రగతి భవన్ ముట్టడిస్తాం. గత నెల ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోయిందని సంబందిత డాక్టర్‌కు 5 ఏళ్ల శిక్ష పడేలా కేసు నమోదు చేశారు. కుక్కకు ఉన్న విలువ మనిషికి లేదా. కార్మికులెరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది’ అని రేవంత్‌ అన్నారు.

తెలంగాణ ద్రోహులు మంత్రులు : షబ్బీర్ అలీ
‘సీఎం మీ ఉద్యోగాలు పోయినయి అంటరు. మంత్రులు ఉద్యోగాలలో చేరాలని అంటరు. ఈ డబుల్ గేమ్ ఏంది. మోటార్ సైకిల్ తోలరానోనికి బస్సు ఇస్తే.. వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తున్నరు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తా అంటున్నారు. సీఎం ఆదేశాల మేరకే మాట్లాడుతున్నారా. హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల అందరం ఒకే సారి సమ్మె కు మద్దతు తెలపలేదు. బంద్‌లో అందరం పాల్గొంటాం’ అని షబ్బీర్‌ అన్నారు.

ఇలాంటి పాలన ఎక్కడా లేదు : దామోదర రాజనర్సింహ
‘దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి దొర పాలన లేదు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలకు స్వేచ్ఛ నిచ్చింది. కేంద్రం ఆర్టీసీ సమస్యపై స్పందించాలి. ఢిల్లీ కి వెళ్లిన గవర్నర్, కేంద్ర పెద్దలతో మాట్లాడి  ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపుతురాని ఆశిస్తున్నాం. కేకే లేఖలో పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ ఖండిస్తోంది. వ్యతిరేకిస్తోంది’అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా