కేక్‌ కట్‌ చేసిన రాహుల్‌, మన్మోహన్‌ సింగ్‌

28 Dec, 2018 11:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ 134వ అవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ  జెండా ఎగురవేశారు. అలాగే మన్మోహన్‌ సింగ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై నేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన కాంగ్రెస్‌లో ఇటీవల రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కొత్త ఉత్తేజాన్ని నింపింది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో డిసెంబర్‌ 28 , 1885 రోజున భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు