గాంధీ భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

10 Nov, 2018 17:06 IST|Sakshi

టిక్కెట్ల కోసం నిరసనకు దిగాన కాంగ్రెస్‌ నేతలు

పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు

సాక్షి, హైదరాబాద్‌ : అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు సిద్దంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి అసంతృప్తి నేతల ఆందోళనలు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. కొంతమంది ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ వద్ద ఆందోళనకు దిగగా.. మరికొందరు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద నిరసనకు దిగారు. అసంతృప్తుల ధర్నాలతో గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగరంలో కీలకంగా మారిన ఉప్పల్‌ టిక్కెట్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ స్థానం టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండడంతో.. టిక్కెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళకు దిగారు. రేపుటిలోగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అసంతృత్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్‌పై మొదటి నుంచి ఉత్కంఠ ఉంది. నకిరేకల్‌ టిక్కెట్‌ ప్రసన్నరాజ్‌కే ఇవ్వాలంటు ఆయన అనుచరులతో నిరసనకు దిగారు.

పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారని ఓవైపు ప్రచారం జరగుతున్నా.. టిక్కెట్‌ తమకే దక్కతుందని హస్తం నేతలు ధీమాతో ఉన్నారు. నకిరేకల్‌ సీటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు దక్కకుంటే తాము పోటీ నుంచి తప్పుకుంటామని కోమటిరెడ్డి సోదరులు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ టిక్కెట్‌ను మాజీ ఎంపీ రమేష​ రాథోడ్‌కు కేటాయిస్తే ఊరుకోమని.. హరినాయక్‌కు ఇవ్వాలంటూ ఆయన అనుచరులు చేస్తున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నామినేషన్లుకు సమయం దగ్గర పడుతుండడంతో సొంతపార్టీ నేతల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా అసంతృప్తులను బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగారు.

మరిన్ని వార్తలు