నెల రోజుల పాటు టీవీ చర్చలకు దూరం

30 May, 2019 18:36 IST|Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. మరో వైపు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఓ నెల రోజుల పాటు కాంగ్రెస్‌ నాయకులేవరు టీవీ చర్చల్లో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.
 

‘ఓ నెల రోజుల పాటు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులను టీవీ చర్చలకు పంపకూడదని పార్టీ నిర్ణయించింది. ఈ సదర్భంగా అన్ని మీడియా సంస్థలకు, ఎడిటర్స్‌కు ఒక విన్నపం. మీ చానెళ్లలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలకు కాంగ్రెస్‌ నాయకులను ఆహ్వానించకండి’ అంటూ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. అయితే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నార‌న్న దానిపై కాంగ్రెస్ పార్టీ సరైన వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. తాజాగా జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 52 స్థానాల్లో మాత్ర‌మే గెలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు