వొక్కలిగల నుంచి హస్తానికి వ్యతిరేకత

16 May, 2018 01:47 IST|Sakshi

బెంగళూరు: వొక్కలిగ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్య జేడీఎస్‌ నాయకుడు జీటీ దేవెగౌడ చేతిలో సుమారు 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలోని మాం డ్య, తుమకూరు, హసన్, కోలార్, చామరాజనగర్‌లోని చాలా స్థానాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలే వీచాయి.

కోలార్‌లో మూడు, తుమకూరులోని మొత్తం 11 సీట్లలో ఆరింటిని గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లోని మొత్తం 45 స్థానాల్లో జేడీఎస్‌ 20కి పైగా సీట్లు గెలుచుకోవడం విశేషం. మాండ్యలో ఉన్న ఆరు సీట్లూ ఆ పార్టీ ఖాతాలోకే చేరాయి. తాజా ఫలితాలపై జీటీ దేవెగౌడ స్పందిస్తూ..‘ సిద్దరామయ్య అంటే వొక్కలిగలకు ఎలాంటి ద్వేషం లేదు. కానీ ప్రచారంలో ఆయన హెచ్‌డీ దెవెగౌడపై చేసిన వ్యాఖ్యలు ఆ వర్గానికి ఆగ్రహం తెప్పించాయి.

దీని వల్లే హసన్, మాండ్యనే కాకుండా వొక్కాలిగల పట్టున్న ఇతర ప్రాంతాల్లోనూ సిద్దరామయ్యపై వ్యతిరేకత పెరిగింది’ అని అన్నారు. ఇక హెచ్‌డీ దేవెగౌడ స్వస్థలమైన హసన్‌లోని ఏడు సీట్లలో జేడీఎస్‌ ఆరింటిని గెలుచుకుంది.  

‘గోవా, మణిపూర్‌లో మీరు చేసిందేమిటి?’
న్యూఢిల్లీ: కర్ణాటకలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పార్లమెంటు సంప్రదాయాల్ని వల్లెవేస్తున్న బీజేపీ.. గోవా, మణిపూర్, మేఘాలయ విషయంలో ఆ సంప్రదాయాన్ని ఎందుకు విస్మరించిందని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. జేడీఎస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటును ఆ పార్టీ సమర్థించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే కాంగ్రెస్‌ నడుచుకుంటోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు.

ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ లేదా పార్టీల కూటమిని ఆహ్వానించాలన్న సంప్రదాయానికి అనుగుణంగానే 1996లో వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉందని గుర్తు చేశారు. అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలన్న సంప్రదాయాల్ని ఆ మూడు రాష్ట్రాల విషయంలో బీజేపీ ఎందుకు అతిక్రమించిందని ఆయన ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

కమలంలో కలహాలు...

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

మీ మైండ్‌సెట్‌ మారదా?

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్‌

చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు..

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్

‘కర్నాటకం’లో కొత్త మలుపు

‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

కర్నాటకం; అసెంబ్లీలోనే భోజనం, నిద్ర

'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'

‘నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..