నగేష్‌ బహిష్కరణకు రంగం సిద్ధం

11 May, 2019 19:29 IST|Sakshi
గొడవ పడుతున్న కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌, నగేష్‌ ముదిరాజ్‌

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. దీని కోసం పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ కోదండ్‌రెడ్డి, ఇతర సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇందిరా పార్క్‌ వద్ద అఖిలపక్ష సమావేశంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావుపైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌ దాడి చేసినట్లు క్రమశిక్షణా సంఘం భావిస్తోన్నట్లు తెలిసింది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ కార్యదర్శి ఆర్సీ కుంతియా సభలో పాల్గొన్న సమయంలో వీహెచ్‌పైన దాడి జరిగిందని భావిస్తున్నట్లు వెల్లడించింది. సీనియర్‌ నాయకులు, పార్టీలో అనేక పదవులు నిర్వహించిన వీహెచ్‌పైన నగేశ్‌ ముదిరాజ్‌ అనుచితంగా ప్రవర్తించి భౌతిక దాడికి దిగడాన్ని క్రమశిక్షణా సంఘం తీవ్రంగా ఖండింది.

క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని క్రమశిక్షణా సంఘం తేల్చి చెప్పింది. ఈ అంశంపైనా అక్కడ సభలో ఉన్న  కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్‌ అలీలను కమిటీకి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా సూచన చేశారు. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా నగేష్‌ ముదిరాజ్‌పైన చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేసింది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి వారినైనా, ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరికలు పంపింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు