మళ్లీ అధికారం మాదే: కమల్‌నాథ్‌

4 May, 2020 12:21 IST|Sakshi
కమల్‌నాథ్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార పీఠాన్ని మళ్లీ దక్కించుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఖాళీ అయిన 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. (కొడుక్కి బుద్ధి చెప్పిన మాజీ మంత్రి)

సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరడంతో 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అసెంబ్లీకి రాజీనామా చేయడంతో మార్చి 20న కమల్‌నాథ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించడంతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించాల్సివుంది. (స్పెషల్‌ ట్రైన్‌ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి)

తనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని కమల్‌నాథ్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కోల్పోయిన 22 అసెంబ్లీ స్థానాలను తిరిగి దక్కించుకుంటామన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనపై జరిగిన తిరుగుబాబు గురించి చెబుతూ.. ‘నేను చాలా బాధ పడ్డాను. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగిపోతారని ఊహించలేకపోయాను. నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కానీ ప్రలోభాలు పెట్టడం తనకు తెలియద’ని కమల్‌నాథ్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు