దేశంలో రెండు వైరస్‌లు : జైవీర్ షెర్గిల్

9 Mar, 2020 21:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక వ్యవస్థను రెండు రకాల వైరస్‌లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్నారు. ఒకటి కరోనా వైరస్‌ అయితే, మరొకటి కేంద్రంలోని బీజేపీ విధానాలని విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను మందులతో తగ్గించవచ్చు కానీ బీజేపీ పకోడానమిక్స్‌ వైరస్‌కు మందులేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం తప్పదని, 2024 వరకు ప్రజలు భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పిక్నిక్‌ మోడ్‌ నుంచి బయటకు వచ్చి కరోనా వైరస్‌ విస్తరించుకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

బీజేపీ ఈ రెండు వైరస్‌లను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపించిన ఆయన.. సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. యస్‌ బ్యాంక్‌ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై కూడా విచారణ జరిపించాలన్నారు.

మరిన్ని వార్తలు