ఆర్టికల్‌ 370 రద్దు; కాంగ్రెస్‌కు భారీ షాక్‌

5 Aug, 2019 17:48 IST|Sakshi
ఎంపీ భువనేశ్వర్ కలిత

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ విప్‌ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సైతం ఆర్టికల్ 370 ఏదో ఒకరోజు రద్దవుతుందని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం పార్టీ సిద్ధాంతాలను మర్చిపోయిందని విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలందరికీ విప్ జారీ చేయాలని తనను ఆదేశించారని, ఈ విప్‌ దేశ మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో విప్ జారీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. భువనేశ్వర్ కలిత అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

వారం వ్యవధిలో కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడం గమనార్హం. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి సంజయ్‌ సింగ్‌ జూలై 30న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దైందా?)
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్‌ ఆయనే’

బీజేపీది ఏకపక్ష ధోరణి

ఆర్టికల్‌ 370 రద్దు: కేజ్రీవాల్‌ సర్‌ప్రైజింగ్‌ ట్వీట్‌!

ఆర్టికల్‌ 370పై అపోహలు, అపార్థాలు

ఆర్టికల్‌ 370 రద్దు.. మోదీ అరుదైన ఫొటో!

ఆర్టికల్‌ 370 రద్దు: రాజ్యాంగ నిపుణుడి కీలక వ్యాఖ్యలు

ఆర్టికల్‌ 35ఏ కూడా రద్దైందా?

టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

‘అలాంటి వ్యక్తిని హోంమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది’

ఆర్టికల్‌ 370 రద్దుకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

ఎంపీలను సభ నుంచి ఈడ్చేసిన మార్షల్స్‌

కేసీఆర్‌, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు

35ఏ ఆర్టికల్‌ ఏం చెబుతోంది

ఆర్టికల్‌ 370 అంటే ఏమిటి?

కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కశ్మీర్‌పై కీలక ప్రకటన చేయనున్న అమిత్‌ షా

కేబినెట్‌ భేటీ.. కశ్మీర్‌పై చర్చ

శ్రీవారి సేవాభాగ్యం దక్కడం అదృష్టం

‘కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం షురూ’

బీజేపీ ఎమ్మెల్యేపై రూ. 204 కోట్ల దావా 

ఓటేయని వాళ్లనూ గెలుచుకోవాలి

ఆమె అంగీకరిస్తే.. పార్టీ అధ్యక్షురాలు అవుతారు!

‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’

రాహుల్‌ వారసుడి ఎంపిక ఎప్పుడంటే..

కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ సమావేశం!

అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

ఉన్నావ్‌ కేసు: 17 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

‘అందుకే ప్యాక్‌ చేసిన సన్నబియ్యం’

అంతుపట్టని కేంద్ర వైఖరి, త‍్వరలో అమిత్‌ షా పర్యటన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’

పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’

సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల

చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌