తొలిసారి విడివిడిగా ఓటేసిన అవిభక్త కవలల

19 May, 2019 15:30 IST|Sakshi

పట్నా : పుట్టుకతోనే తల భాగం అతుక్కొని పుట్టిన బిహారీ కవలలు సబా- ఫరా (23)లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కవలలు పట్నాసాహిబ్ నియోజకవర్గంలోని దిఘా అసెంబ్లీ పరిధిలోతమ ఓటు వేశారు.  పట్నానగరంలోని సమన్‌ పురా ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరికి తొలిసారి వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించున్నారు. అప్పట్లో వీరిద్దరిని ఒక్కరుగానే పరిగణించి ఓటు గుర్తింపుకార్డు ఇచ్చారు. కానీ శారీరకంగా కలిసి ఉన్నంతమాత్రన వారి వ్యక్తిగత హక్కులను కాదనడం సరికాదని పట్నా జిల్లా కలెక్టర్‌ కుమార్‌ రవి వారిద్దరికి వేర్వేరు గుర్తింపు కార్డులు జారీ చేశారు.

ఈ కవలలిద్దరూ బాలీవుడ్‌ సల్మాన్‌ఖాన్‌కు వీరాభిమానులు. వారి గురించి తెలుసుకున్న సల్మాన​ ముంబాయికి పిలిపించుకున్నారు. వాళ్లిద్దరూ సల్మాన్‌కు రాఖీ కట్టి అభిమానం చాటుకున్నారు. వీరి కుటుంబానికి ప్రతి నెల రూ. 5వేల పెన్షన్‌ వచ్చేది. దానికి రూ. 20వేలకు పెంచాలని సుప్రీం కోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

మరిన్ని వార్తలు