మహానేత కుటుంబాన్ని కడతేర్చే కుట్ర

17 Mar, 2019 08:51 IST|Sakshi

రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. ఆ కుటుంబాన్ని కడతేర్చితే రాజకీయంగా తనకు తిరుగుండదని చంద్రబాబు భావించారని.. అందువల్లే వైఎస్‌ కుటుంబంపై కక్ష కట్టి.. మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

  • 1999లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. కడప జిల్లాపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి ముద్ర బలమైంది. వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేస్తే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కడప జిల్లాకే పరిమితం చేయవచ్చునని.. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవచ్చునని నాటి సీఎం చంద్రబాబు భావించారని చెబుతున్నారు. వైఎస్‌ రాజారెడ్డిని మే 23, 1998న పులివెందులకు సమీపంలో హత్య చేశారు. హత్య చేసిన వారికి నెల రోజులపాటూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికారిక నివాసంలోనే ఆశ్రయం కల్పించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. వైఎస్‌ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌రెడ్డిని ఇటీవల క్షమాబిక్షపై విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతోంది.
     
  • దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆగస్టు 31, 2009న శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా, ఎవరు ఫినిష్‌ అవుతారో చూద్దాం.. అంటూ  సవాలు చేశారు. ఆ తర్వాత సెప్టెంబరు2,2009న మహానేత హెలికాఫ్టర్‌ ప్రమాదంలో అశువులు బాశారు. హెలికాఫ్టర్‌ ప్రమాదంపై అనుమానాలున్నాయని.. చంద్రబాబు అసెంబ్లీలో హెచ్చరించిన రెండు రోజులకే తన తండ్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి మరణించారని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.
     
  • 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించేందుకు కుట్రపన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరూ ప్రవేశించలేని వీఐపీ లాంజ్‌లో.. తనకు అత్యంత సన్నిహితుడైన నేతకు చెందిన రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగి ద్వారా వైఎస్‌ జగన్‌ను కడతేర్చేందుకు 2018 అక్టోబరు 25న కుట్ర చేశారు. హత్యాయత్నం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటపడ్డ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అనేలా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
     
  • వైఎస్‌ వివేకానందరెడ్డి కడప జిల్లాల్లో అత్యంత బలమైన నేత. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఆయన ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడ రెండు ఫ్యాక్షన్‌  కుటుంబాలను ఏకం చేసిన చంద్రబాబు.. రాజకీయ ప్రాబల్యం కోసమే వ్యూహాత్మకంగా వైఎస్‌ వివేకానందరెడ్డిని అడ్డుతొలగించేలా స్కెచ్‌ వేశారనే ఆరోపణలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. 
మరిన్ని వార్తలు