గుజరాత్‌ మాజీ సీఎం వాఘేలాకు కరోనా

28 Jun, 2020 09:58 IST|Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌ : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింగ్‌ వాఘేలా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో శంకర్‌ సింగ్‌ వాఘేలాకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. (జూలై 5 తరువాత లాక్డౌన్? )

వాఘోలా కొత్త పార్టీ
కాగా గుజరాత్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శంకర్‌ సింగ్‌ వాఘేలా ప్రజశక్తి మోర్చా పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన  కొద్దిరోజల క్రితం ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వాఘేలాను  పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఏకైక ఎన్‌సిపి ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్సీపీకి రాజీనామా చేశారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పార్టీల్లో కొనసాగారు. జన్ సంఘ్ నుంచి బీజేపీ, రాజ్పా, కాంగ్రెస్‌, జన్‌ వికల్ప్‌ , నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీల్లో పని చేశారు. 

మరిన్ని వార్తలు