పరిషత్‌ ఫలితాలు వాయిదా వేయండి: చాడ

17 May, 2019 20:18 IST|Sakshi
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

కరీంగనగర్‌: పరిషత్‌ ఎన్నికల ఫలితాలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి కోరారు. లేదంటే ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లో జెడ్పీ చైర్మన్‌, ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జూలై 3 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుస్తు ఎన్నికలు నిర్వహించారని, గడువు ముగిసే వరకు  జెడ్పీ చైర్మన్‌ , ఎంపీపీ ఎన్నిక నిర్వహించకుంటే క్యాంపు రాజకీయాలను ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు.

ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు భారీగా ఖర్చు చేసి గెలిచి డబ్బు సంపాదనపైనే ప్రజాప్రతినిధులు దృష్టిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అక్రమాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని భర్తరఫ్‌ చేయాలని చాడ డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు