కేసీఆర్‌ మోదీతో కుమ్మక్కయ్యారు: నారాయణ

2 Jun, 2018 16:28 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కేసీఆర్‌ను పొగుడుతున్నారని గుర్తు చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తో అందర్నీ చీల్చు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లున్నారు. కేసీఆర్‌ మోదీతో కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరు మీద కేసీఆర్‌ ...మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ని ప్రజల నమ్మరని నారాయణ పేర్కొన్నారు.

‘తెలంగాణ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మొదటి దశగా నిరుద్యోగులకు 25 వేలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు 50 వేలు ఉద్యోగాలు ప్రకటించాము అంటున్నారు. మరీ ఇచ్చిన హామీలలో ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఏమైంది? కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ని ఏర్పాటు చేయాలని’ నారాయణ డిమాండ్‌ చేశారు. 

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన రూ. 4000  రైతులకు ఉపయోగపడిందా అని ఆయన ప్రశ్నించారు.  రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. రూ. 4000 రైతులకు ఇచ్చి, పరమానందయ్య శిష్యులు మొద్దుకి సూది పొడిచినట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రజల సొమ్ము వాడుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పెట్రోల్‌, డీజల్‌లను జీఎస్టీలలో కలపాలన్నారు. జీఎస్టీలో కలపడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 4 లక్షల కోట్ల భారం తగ్గుతుందని నారాయణ సూచించారు.

మరిన్ని వార్తలు