ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జగరడం లేదు : రామకృష్ణ

10 Apr, 2019 12:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తన బాధ్యతను నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగడం లేదని, డబ్బుతో ఎన్నికలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కనీస చర్యలు తీసుకున్న అభ్యర్థుల్లో భయం ఉండేదన్నారు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఎన్నికల నియమావళి పక్కన పెట్టి క్షిఫణి ప్రయోగంపై మాట్లాడడం దారుణమన్నారు. అమరావతిలో అభివృద్ధి జరిగిందని చెప్పుకున్న చంద్రబాబు.. ఓటుకు డబ్బులు ఎందుకు పంచుతున్నారో చెప్పాలన్నారు. మార్పు కావాలంటే డబ్బు ఇచ్చిన వారికి ఓటెయ్యొద్దని ప్రజలకు సూచించారు. ఇంతకు ముందు ఎన్నికలు అంటే రాయలసీమ తనిఖీలలో బాంబులు దొరికేవని, ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బులు దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల నియమావళి చూడడానికి చాలా కఠినంగా ఉన్నా రాష్టంలో డబ్బు విచ్చల విడిగా పంచుతున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు