‘ఆయనకది సిగ్గు చేటు’

14 Sep, 2018 16:01 IST|Sakshi
రామకృష్ణ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకది సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. కోడెల శివప్రసాద్‌ స్పీకర్‌గా ఉంటూ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెయిన్‌ గన్స్‌ ద్వారా ఒక్క ఎకరా అయినా సాగు జరిగిందా అని ప్రశ్నించారు. అసలు రెయిన్‌ గన్‌లు ఎక్కడ ఉన్నాయి.. మీ నాయకుల ఇళ్లలోనా.. చూపించండి అంటూ సవాల్‌ విసిరారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా ఎవరైనా ఈ విధంగా చూపిస్తారా అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో చేనేత, ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు! ఉద్యమకారులపై కేసులు పెట్టి జైలులో పెట్టావు మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. ఉద్యమం నేపథ్యంలో తమపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తానన్న సంగతిని గుర్తుచేశారు. ఇప్పటి వరకు అది జరగలేదని, వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దటీజ్‌ వైఎస్‌ జగన్‌!

‘ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వానిదే బాధ్యత’

31న వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నా: ఎమ్మెల్యే మేడా

‘చంద్రబాబు.. మీ బట్లర్‌ ఇంగ్లీష్‌ అందరికీ తెలుసు గానీ’

ఆర్థికమంత్రి లేకుండా పరిపాలన ఎలా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’

‘మజ్ను’పై రామ్‌చరణ్‌ కామెంట్‌..!

ఈ బుడ్డోడు ఇప్పుడు సెన్సేషనల్‌ స్టార్‌..!

‘అర్జున్‌ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్‌

సెన్సేషనల్‌ స్టార్‌తో సెన్సిబుల్‌ డైరెక్టర్‌..!

రీల్ సైంటిస్ట్‌.. రియల్‌ సైంటిస్ట్‌