‘ఆయన మాటలు బీజేపీకి వినిపించడం లేదా’

25 Jun, 2018 10:59 IST|Sakshi

సాక్షి, విశాఖ​: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదేమో కానీ, అప్పులమయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 94 వేల కోట్లు ఉన్న అప్పును రెండు లక్షలకు తీసుకెళ్లడం అభివృద్దా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక​ హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. ఉక్కు కర్మాగారం కోసం వామపక్షాలు పోరాడితే అరెస్టులు చేయించారని, కానీ ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 29న కడప బంద్కు పిలుపునిచ్చామని.. అందరు సహకరించాలన్నారు. విశాఖలో భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు ఎప్పటివరకు చేస్తారన్నారు. ఈ కుంభకోణాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనే బయపెట్టడం లేదా అని ప్రశ్నించారు. వారం రోజులు గడువిస్తున్నామని.. ఒకవేళ నివేదిక బయటపెట్టకపోతే ఉద్యమిస్తామన్నారు.

కార్మికుల, గిరిజన, విద్యార్ది ఉద్యోగల సమస్యపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమవుతున్నాయన్నారు. అన్ని వర్గాలతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జూలై 8 విశాఖలో కార్మికులు సమస్యలపై సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది.. ఇసుక మాఫియా పెరిగిపోయింది.. అధికార పార్టీ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా జూలై 2న నీలం రాజశేఖర్ రెడ్డి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతపురంలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రజలను కేంద్రప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఫ్యుజుబులిటీ ఉన్నా రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో పరిశీలించమని ఉందనడం దారుణమన్నారు. కడప ఉక్క పరిశ్రమ వస్తుందని బీజేపీ మాటలాడుతోందని..  పీయూష్‌ గోయల్ అన్నమాటలు బీజేపీ వాళ్లకి వినిపించడం లేదా ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు