టీఆర్‌ఎస్‌ ప్రచారంలో వాస్తవం లేదు: నారాయణ

6 Dec, 2018 06:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమైనా నిర్ణయా లు తీసుకోగలుగుతుం దా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ప్రజాఫ్రంట్‌ అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ, ఏపీ నుంచి చంద్రబాబు చక్రం తిప్పుతారంటూ టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బుధవారం మగ్దూమ్‌భవన్‌లో పార్టీనాయకులు అజీజ్‌పాషా, బాలమల్లేశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో 5–10 శాతం మంది మాత్రమే సంక్షేమపథకా లు, రైతుబంధు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నం దున, మిగతా వారి ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే అవకాశముందన్నారు. ఇక్కడ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా కేంద్రంలో మోదీ సర్కార్‌కు చెక్‌ పెడితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు అవుతుందన్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ నేతలకు చెందిన కాలేజీలకు ఏఐసీటీయూ అనుమతినిచ్చేలా చేశారన్నారు. ఈ కాలేజీల నుంచి టీఆర్‌ఎస్‌కు ముడుపులు అందాయని నారాయణ ఆరోపించారు.

మరిన్ని వార్తలు