రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం: రామకృష్ణ

19 Jan, 2019 15:17 IST|Sakshi
మాట్లాడుతున్నా రామకృష్ణ

సాక్షి, ప్రకాశం: చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి పది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు ప్రచారంలో తప్ప... రాష్ట్రంలో అభివృద్ధి ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల స్టెంట్లో భాగంగానే చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నాడని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్  ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పని చేస్తున్నాడని అన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు