పేదల సమస్యలకే పెద్దపీట

27 Sep, 2018 05:35 IST|Sakshi

సీపీఎం మేనిఫెస్టో కమిటీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురైన పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పనకు సీపీఎం కసరత్తు చేస్తోంది. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ రెండో సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగింది. నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన అభివృద్ధి జరగాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అందడానికి తీసుకోవాల్సిన చర్యలపై మేనిఫెస్టోలో నిర్దిష్టంగా చెప్పడానికి కసరత్తు జరిగింది. రైతులు, భూమి లేని కూలీలు, పేదలకు ఇళ్లు వంటివి సమకూర్చడానికి ఉన్న మార్గాలను సీపీఎం మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం అందించడంతో పాటు భూమి లేని నిరుపేదలకు భూమిని అందించడానికి ఉన్న అవకాశాలను కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొననున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాకు రెండురోజుల్లో తుదిరూపు ఇస్తామని సీపీఎం నేతలు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు