టీఆర్‌ఎస్‌లోకి సీపీఎం నేతలు

30 Mar, 2019 12:35 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పటికే కాంగ్రెస్‌, టీడీపీ నుంచి టీఆర్‌ఎఎస్‌లోకి వలసలు జోరుగా కొనసాగుతుండగా తాజాగా సీపీఎం పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేశారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థి  కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అందరం కలిసి పనిచేయడం ద్వారానే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేదల ఎజెండానే మన ఎజెండాగా కలిసి పనిచేద్దామని ఆయన పిలుపు నిచ్చారు.

కాలం చెల్లిన సిద్ధాంతాలతో సీపీఎం పార్టీ కనుమరుగు అయ్యింది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండేవారు  కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రోజురోజుకు బలపడుతోందని చెప్పారు. ఎంపీ ఎలక్షన్స్‌ లో ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. రాష్టంలో పోలింగ్ శాతాన్ని పెంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు