సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సీపీఎం నేతలు

1 Jul, 2019 19:03 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో ఏపీ సీపీఎం నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, గఫుర్‌, వైవీలు ఉన్నారు. తమపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీపీఎం నేతలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు నేతలు తెలిపారు. విద్యుత్‌ రంగాల్లో యూనియన్ల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడమని చెప్పారు. తాము చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సీపీఎం నేతలు పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన కేజీవీబీ ఉపాధ్యాయుల సంఘం
ఆంధ్రప్రదేశ్‌ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సోమవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 352 పాఠశాలల్లో 2600 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు పద్ధతిలో 14 ఏళ్లుగా పనిచేస్తున్నట్టు వారు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి అలవెన్సు లేకుండా, తక్కువ జీతానికి తాము పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులు సంఘం ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు