‘ఎన్‌ఆర్సీ చట్టాన్ని సీఎం కేసీఆర్‌ వ్యతికించాలి’

24 Dec, 2019 10:26 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకవచ్చిన ఎన్‌ఆర్సీ చట్టంపై సీఎం కేసీఆర్‌ నోరు విప్పి దీన్ని వ్యతిరేకించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని వీర భద్రం తెలిపారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన సీపీఎం జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఎన్‌ఆర్‌సీ(పౌరుల జాతీయ జాబితా)చట్టం తేవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి తనకు సంబంధించిన నాలుగు తరాల రికార్డులు చూపించాలి, లేకుంటే దేశం నుంచి బహిష్కరిస్తారన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన సిక్కు, జైన్, బౌద్దం, హిందు వారికి ఎలాంటి ప్రమాదం లేదని, కేవలం ముస్లీంలను పంపిస్తామని అనడం సరికాదన్నారు.  

అప్పుల రాష్ట్రంగా మార్చారు.. 
కేసీఆర్‌ తీసుకుంటున్న నియంత నిర్ణయాల వల్ల మిగులు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం రూ. 50వేల కోట్లు అప్పులు ఉంటే, ఇప్పుడు రూ. 3లక్షల కోట్లకు అప్పులు పెరిగిపోయాయన్నారు. ముస్లింలపై పరోక్షంగా ప్రేమ చూపిస్తున్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందు కు స్పందించడం లేదని మండిపడ్డారు. ఎన్‌ఆ ర్సీ  చట్టాన్ని కేసీఆర్‌ వ్యతిరేకించాలని కోరారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ.. 2018–19లో 1.36 కోట్ల ఉద్యోగాలు తీసేశారన్నారు. 35 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. మోదీ తొలిసారి ప్రధాని కాగానే ఉత్పత్తి 7 శాతానికి పెరిగిందని, కానీ ఇ ప్పుడు ఐదు శాతానికి పడిపోయిందన్నారు. కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు త్వరలోనే కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్య క్తం చేశారు. గూగుల్‌ సంస్థ తాజా లెక్కలు చూ డడంతో అందరు సోషలిజం వైపు ఆకర్షితులు అవుతున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి అర్థం చేసు కోవాలని ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. నిజామాబాద్‌జిల్లాలో ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త బాగా కష్టపడాలన్నారు. సమావేశంలో  రాష్ట్ర నాయకు లు జయలక్ష్మీ, జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, సబ్బనిలత జిల్లా నాయకులు మల్యల గోవర్థన్, అభిలాష్, సంజీవ్, సుజాత, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు