దమ్ముంటే చర్యలు తీసుకోండి: డీఎస్‌

20 Jan, 2020 19:02 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పు చేశానని.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం డీఎస్‌ మీడియాతో​ మాట్లాడుతూ.. తండ్రి, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లా అని టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని డీఎస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తలతిక్క మాటలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తనపై ప్రశాంత్‌రెడ్డి చేసిన విమర్శలను డీఎస్‌ తీవ్రంగా ఖండించారు. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా.. తన సస్సెన్షన్‌ తీర్మానంపై సంతకాలు పెట్టారని డీఎస్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తనపై సోనియాగాంధీకి తప్పుడు నివేదిక ఇవ్వటం వల్ల తాను మనస్తాపంతో కాంగ్రెస్‌పార్టీని వీడానని డీఎస్‌ వెల్లడించారు.
చదవండి: సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ బహిరంగ లేఖ

మరిన్ని వార్తలు