‘మే 23న సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం’

2 Apr, 2019 20:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అధికార పక్షాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలోనే పవన్ కళ్యాణ్ పరిజ్ఞానం కనబడుతోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన అవగాహనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు కుయుక్తులకు మరోసారి మోసపోవడానికి మహిళలు సిద్ధంగా లేరన్నారు.

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి రూ.100 కోట్లు ఖర్చు చేయడం కోసమే విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు చంద్రబాబు కేటాయించారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా మే 23న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పాల డబ్బాల్లో డబ్బును తరలిస్తున్నారని, వాటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే మాకవరపాలెం, పాయకరావుపేటలో ఆ డబ్బును పోలీసులు గుర్తించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా వస్తుంటే చంద్రబాబు తోక పత్రికలో తప్పుడు సర్వేలు చూపిస్తున్నారని దాడి వీరభద్రరావు మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?